కిరణ్ ఉంటే ఎంత, పోతే ఎంత | dont care about kiran kumar reddy :damodhara raja narasimha | Sakshi
Sakshi News home page

కిరణ్ ఉంటే ఎంత, పోతే ఎంత

Sep 29 2013 2:16 AM | Updated on Jul 29 2019 5:31 PM

కిరణ్ ఉంటే ఎంత, పోతే ఎంత - Sakshi

కిరణ్ ఉంటే ఎంత, పోతే ఎంత

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీల్డ్ కవర్ సీఎం మాత్రమేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజన ర్సింహ చెప్పారు. ఎమ్మెల్యేలు ఎన్నుకోకుండా దొంగచాటుగా ఢిల్లీకి వెళ్లి, పైరవీలు చేసి పదవి దక్కించుకున్నాడని, అటువంటి ముఖ్యమంత్రి ఉంటే ఎంత? పోతే ఎంత? అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీల్డ్ కవర్ సీఎం మాత్రమేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజన ర్సింహ చెప్పారు. ఎమ్మెల్యేలు ఎన్నుకోకుండా దొంగచాటుగా ఢిల్లీకి వెళ్లి, పైరవీలు చేసి పదవి దక్కించుకున్నాడని, అటువంటి ముఖ్యమంత్రి ఉంటే ఎంత? పోతే ఎంత? అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శనివారం రాత్రి జూబ్లీహాల్‌లో జరిగిన గుర్రం జాషువా 118వ జయంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోతే నీటియుద్ధాలు జరుగుతాయని సీఎం చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. నీటి యుద్ధాలు ఎందుకు జరుగుతాయని ప్రశ్నించారు. ఇప్పటి వరకు నిర్ణయాలు తీసుకున్నది, రాష్ట్రాన్ని 56 ఏళ్లపాటు పాలించినది ఎవరని ప్రశ్నించారు.
 
  కాంగ్రెస్ పార్టీ ఎంత ముఖ్యమో, ఆ పార్టీ తీసుకున్న నిర్ణయమూ అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా బూటకపు ఒప్పందాలు చేసి, వారి మనోభావాలను దెబ్బతీసింది సీమాంధ్ర నాయకులేనన్నారు. అతి త్వరలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల తప్పకుండా సాకారం కానుందని రాజనర్సింహ స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement