గెలిపించిన పార్టీ పై కూడా విశ్వాసం లేదు | Do not count on the party | Sakshi
Sakshi News home page

గెలిపించిన పార్టీ పై కూడా విశ్వాసం లేదు

Nov 15 2014 1:05 AM | Updated on Aug 10 2018 8:08 PM

పదవీ కాంక్షతో, గెలిపించిన పార్టీపై కనీస విశ్వాసం కూడా లేకుండా...ఇంగిత జ్ఞానం లోపించిన ఈదర హరిబాబు చైర్మన్ కుర్చీలో కూర్చున్నారని,

పొదిలి: పదవీ కాంక్షతో, గెలిపించిన పార్టీపై కనీస విశ్వాసం కూడా లేకుండా...ఇంగిత జ్ఞానం లోపించిన ఈదర హరిబాబు చైర్మన్ కుర్చీలో కూర్చున్నారని, జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ ధ్వజమెత్తారు. స్థానిక ఎంపీపీ కార్యాలయంలో గెలిపించిన పార్టీపై కూడా విశ్వాసం లేదు. శుక్రవారం రాత్రి ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కలెక్టర్ ఆర్డర్‌ను కోర్టు తిరస్కరించింది...అదే చైర్మన్ కుర్చీలో కూర్చోవటానికి ఉత్తర్వుగా భావించి, కూర్చోవడం చిన్నపిల్లల చేష్టగా బాలాజీ అభివ ర్ణించారు.

చైర్మన్‌గా హరిబాబు అనర్హుడని తేలిన తరువాత, అధికారుల సూచన మేరకు తాను చైర్మన్ పదవి చేపట్టానని గుర్తు చేశారు. పార్టీ రాష్ట్ర నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని, లేదా తననైనా సంప్రదించి పరిస్థితి గురించి అడగాల్సిందన్నారు. ఇవేమీ లేకుండా, నేరుగా కుర్చీలో కూర్చుంటే దాని అర్థం ఏమిటో అవగతం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జెడ్పీ సీఈవో, పంచాయతీ కమిషనర్‌కు లెటర్ పెట్టారు. టీడీపీవారు ఆ ఉత్తర్వులపై డివిజన్ బెంచికి అప్పీల్ చేశారు, ఈవిషయంలో తదుపరి ఆదేశాల కోసం సమాచారం ఇస్తున్నామని లెటర్ పెట్టారు.

లీగల్ ఒపీనియన్ అనంతరం దానికి బహుశా సమాధానం వస్తుంది. రెండు మూడు రోజులు వేచి చూసే ఓపిక కూడా లేకపోతే ఎలా’ అని ప్రశ్నించారు.  హరిబాబును చైర్మన్‌గిరికి అర్హుడని కోర్టు తేల్చిన మరుక్షణమే కుర్చీ వీడి, అతనికి దండ వేసి మరీ కుర్చీలో కూర్చునపెట్టే నైజం తనకుందని బాలాజీ చెప్పారు.  ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకే పదవి తప్ప, అది ఇంక దేనికీ పనికిరాద న్నారు. వైస్ చైర్మన్‌గా ఉండటం తనకు ఇష్టం లేదని, అయితే పార్టీ వ్యూహం మేరకు హరిబాబుకు సపోర్టు చేశామని చెప్పారు.  

చైర్మన్‌గా అధికారులు ఇచ్చిన ఆర్డర్ ఉంది, కుర్చీ ఉంది.. కారు ఉంది..జెడ్పీ సీఈవోనే బాలాజీనే జెడ్పీ చైర్మన్ అని తేల్చి చెప్పారు కదా అని అన్నారు. సమావేశంలో ఎంపీపీ కె.నరసింహారావు, కోఆప్షన్ సభ్యుడు షేక్.మస్తాన్‌వలి, పార్టీ మండల నాయకుడు వాకా వెంకటరెడ్డి, సర్పంచ్‌లు పి.శ్రీనివాసరావు, పి.ఓంకార్, వార్డు సభ్యులు షేక్.ఖాశీం, నాయకులు పి.బాలయ్య, గుంటూరు పిచ్చిరెడ్డి, టి.నరసారెడ్డి, వెలుగోలు కాశీ తద తరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement