11న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం | diwali at venkateswara temple in tirumala | Sakshi
Sakshi News home page

11న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

Nov 6 2015 2:56 AM | Updated on Sep 3 2017 12:04 PM

11న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

11న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

ఈనెల 11వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు.

సాక్షి, తిరుమల: ఈనెల 11వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ప్రతి ఏటా దీపావళి (అమావాస్య) రోజున ఆలయంలో సుప్రభాతం నుంచి మొదటి గంట నివేదన నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య బంగారు వాకిలి ముందు ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం నిర్వహిస్తారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పను సర్వభూపాల వాహనంపై, మరో వాహనంపై విష్వక్సేనుడిని వేంచేపు చేస్తారు. ప్రత్యేక పూజలు, హారతి, ప్రసాద నివేదనలు చేస్తారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement