ఓటు వజ్రాయుధం | District Collector C .sudharshan reddy equal democratic vote. Arise, he said. | Sakshi
Sakshi News home page

ఓటు వజ్రాయుధం

Jan 23 2014 4:16 AM | Updated on Sep 2 2017 2:53 AM

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధంతో సమానమని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి అన్నారు.

 కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధంతో సమానమని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం స్థానిక కోల్స్ కళాశాలల్లో విద్యార్థులకు జిల్లా స్థాయి క్విజ్, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. నియోజకవర్గ స్థాయి సీనియర్, జూనియర్ విభాగాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు జిల్లా స్థాయి పోటీల్లో అవకాశం కల్పించారు.
 
 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఓటు హక్కుపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో విజేతలకు ఈనెల 25న సునయన ఆడిటోరియంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా బహుమతులను ప్రధానం చేస్తామన్నారు. మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో ఈనెల 24న జరగనున్న పోటీలకు పంపుతామన్నారు. కార్యక్రమంలో కోల్స్ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement