నంద్యాల టీడీపీలో భగ్గుమన్న విభేదాలు

Disputes In Kurnool Nandyal TDP Over Wakf Board Lands - Sakshi

సాక్షి, కర్నూలు : వక్ఫ్‌ బోర్డు భూములు కేంద్రంగా నంద్యాల టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. వక్ఫ్‌ బోర్డు భూములను కబ్జా చేస్తున్న టీడీపీ నేతలపై ఆ పార్టీ సీనియర్‌ నేత ఎన్‌.ఎం.డి ఫరూఖ్‌ ఆగ్రహించారు. వివరాల్లోకి వెళితే.. నంద్యాలలోని సర్వే నెం. 286లో ఉన్న వక్ఫ్‌ బోర్డుకు చెందిన 22.85 ఎకరాల స్థలంపై టీడీపీలోని ఓ నేత కన్నేశాడు. అదే విధంగా 236 సర్వే నెం.లోని 16 ఎకరాల స్థలంపై టీడీపీలోని మరో వర్గం నాయకుడు కన్నేశాడు.

వక్ఫ్‌ బోర్డు పక్కనే ఉన్న తన వెంచర్లకు వక్ఫ్‌ భూములను రహదారులుగా మార్చుకున్నాడు. దీంతో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యులు మండలి ఛైర్మన్‌ ఫరూఖ్‌ను కలిసి జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఆక్రమణలకు పాల్పడుతున్న టీడీపీలోని ఒక వర్గం వారిపై ముస్లింలు తిరగబడాలని, ధర్నాలు, రాస్తారోకోలు చేయాలంటూ ఫరూఖ్‌ పిలుపునిచ్చారు. కాగా కబ్జాను అడ్డుకుంటున్న అధికారులపై టీడీపీ నేతలు దాడులు, బెదిరింపులకు పాల్పడుతుండటం గమనార్హం.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top