సభలు, సమావేశాల్లో జాగ్రత్తగా మాట్లాడాలంటూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణకు
పితానికి సీఎం క్లాస్
Nov 17 2013 2:37 AM | Updated on Sep 2 2017 12:40 AM
	 ఏలూరు, న్యూస్‌లైన్ :సభలు, సమావేశాల్లో జాగ్రత్తగా మాట్లాడాలంటూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణకు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ శనివారం క్లాస్ తీసుకున్నారు. పెనుగొండ మండలం జగన్నాథపురంలో శుక్రవారం నిర్వహించినరచ్చబండ సభలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కన్నా లక్ష్మీనారాయణను ‘మరో ముఖ్యమంత్రి’ అని మంత్రి పితాని సంబోధించిన నేపథ్యంలో ఆయనపై సీఎం కిరణ్ కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
	 
	 
					
					
					
					
						
					          			
						
				
	  పితాని చేసిన వ్యాఖ్యను సభావేదికపై ఉన్నప్పుడు ముఖ్యమంత్రి తేలికగానే తీసుకున్నారు. సభ ముగిశాక పెనుగొండలోని మార్కెట్ కమిటీ కార్యాలయూనికి చేరుకున్న సీఎం శుక్రవారం రాత్రి అక్కడే బస చేసిన విషయం విదితమే. పితాని చేసిన వ్యాఖ్యలు పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితం కావడంతో మంత్రి పితానిని ఉద్దేశించి ‘మరో ముఖ్యమంత్రి అనడం కరెక్ట్ కాదు. జాగ్రత్తగా మాట్లాడకపోతే ఇబ్బందులొస్తాయ్’ అంటూ శనివారం ముఖ్యమంత్రి చిరుకోపం ప్రదర్శించారని సమాచారం.
Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
