గుప్త నిధుల కోసం తవ్వకాలు | Digging for hidden treasures, 6 arrested | Sakshi
Sakshi News home page

గుప్త నిధుల కోసం తవ్వకాలు

Nov 20 2015 4:17 PM | Updated on Sep 3 2017 12:46 PM

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం మల్లకాలువ సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ధర్మవరం అర్బన్: అనంతపురం జిల్లా ధర్మవరం మండలం మల్లకాలువ సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ వేణుగోపాల్ శుక్రవారం దీనికి సంబంధించిన వివరాలు తెలిపారు. మల్లకాలువ  సమీపంలో ఆంజనేయస్వామి ఆలయం పక్కన గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నట్టు గురువారం రాత్రి పోలీసులకు సమాచారం అందింది. రూరల్ ఎస్‌ఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది వెళ్లి ఆరుగురిని అరెస్ట్ చేశారు. గంజికుంట రవికుమార్, గడ్డం రామాంజనేయులు, బండారు శ్రీనివాసులు, ముక్తాపురం సూర్యనారాయణ, జయంత్‌రెడి, చిన్నగిరిలు పట్టుబడ్డారు. వీరి నుంచి జియోహంటర్ మెషీన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement