పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం నాగరాజపేటలో అతిసారం వ్యాధి అదుపులోకి వచ్చింది.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం నాగరాజపేటలో అతిసారం వ్యాధి అదుపులోకి వచ్చింది. వారం రోజుల వ్యవధిలో సుమారు 60 మంది అతిసారం బారిన పడి అస్వస్థతకు గురికాగా, ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. మంగళవారం కూడా నలుగురు అతిసారం బారినపడినట్టు సమాచారం. గ్రామంలోని నీటి నమూనాలను ప్రయోగశాలకు పంపారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో కృపావరం పర్యవేక్షణలో డాక్టర్ అరుణారావు వైద్య సేవలు అందిస్తున్నారు.