‘డయల్ యువర్ ఎస్పీ’కి 25 ఫిర్యాదులు | 'Dial Your espiki 25 complaints | Sakshi
Sakshi News home page

‘డయల్ యువర్ ఎస్పీ’కి 25 ఫిర్యాదులు

Oct 14 2014 2:58 AM | Updated on Mar 19 2019 6:59 PM

జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో 25 ఫిర్యాదులు అందాయి. బెల్టుషాపు, ఇసుక రవాణా తో పాటు పలు సివిల్ కేసులకు సంబంధించి ఫిర్యాదులు ఎక్కువగా అందా రుు.

చిత్తూరు (అర్బన్): జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో 25 ఫిర్యాదులు అందాయి. బెల్టుషాపు, ఇసుక రవాణా తో పాటు పలు సివిల్ కేసులకు సంబంధించి ఫిర్యాదులు ఎక్కువగా అందా రుు. జిల్లాలోని పెద్దపంజాణి, శంకరాయనిపేట, శివాడి, చిత్తూరు, మదనపల్లె, వెదుకుప్పం, పాతగుంట ప్రాంతా ల్లో బెల్టుషాపులు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు ఫిర్యాదు చేశారు.  పీలేరులోని టెలిఫోన్ కాలనీ, చిత్తూరులోని పలు ప్రాంతాల్లో సారా విక్రయాలు జోరుగా జరుగుతున్నాయని వివరించారు. పుం గనూరులో అమ్మాయిలను వేధిస్తున్నారని, మదనపల్లె, చిప్పిలి ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఫిర్యాదులు అందాయి.

చిత్తూరు సీసీఎస్, పీలేరు పోలీసు స్టేషన్ల పరిధిలో చోరీ ఘటనలపై ఫిర్యాదులు చేస్తే ఇప్పటి వరకు సొమ్ము రికవరీ చేయలేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. కుటుంబ గొడవలు, పలు సివిల్ తగాదాలు, తిరుపతికి సంబంధించి నాలుగు ఫిర్యాదులు అందాయి. వచ్చిన ఫిర్యాదులపై సత్వరమే విచారణ చేసి నివేదిక అందచేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.  కార్యక్రమంలో అదనపు ఎస్పీ అన్నపూర్ణారెడ్డి, చిత్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు, సీఐలు శ్రీకాంత్, చిన్నగోవిందు పాల్గొన్నారు.
 
కానిస్టేబుల్‌పై ఫిర్యాదు

శ్రీకాళహస్తి రూరల్ పోలీసు స్టేషన్ కాని స్టేబుల్  దేవప్రసాద్, తన కూతురు రమ్యను కిడ్నాప్ చేశాడని  తండ్రి బాబు ఎస్పీకు ఫిర్యాదు చేశారు. రమ్యను ఏడా దిక్రితం, లక్ష్మీప్రసాద్‌కు ఇచ్చి వివాహం చేశామని వివరించారు. పెళ్లి చూపుల సమయంలో వచ్చిన ఆ కానిస్టేబుల్ రమ్యతో పరిచయం పెంచుకుని ఈ పని చేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఈనెల 8న పాలసముద్రం మండలం నల్లవెంకటయ్యగారిపల్లెలోని తన తం డ్రి ఇంటి వద్ద ఉన్న రమ్యను దేవప్రసాద్  కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడని,  దీనిపై అప్పుడే పాలసముద్రం ఎస్‌ఐకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement