
ఆదివారం తిరుమలలో లగేజీ కౌంటర్ వద్ద భక్తుల తోపులాట
తిరుమలలో భక్తుల రద్దీకి తగ్గట్టుగా సదుపాయాలు కల్పించలేక టీటీడీ అధికారులు చేతులెత్తేశారు. అన్ని చోట్లా గందరగోళ పరిస్థితి ఏర్పడి భక్తులు నలిగిపోయారు. దాంతో మూకుమ్మడిగా ఏటీసీ లగేజీ కౌంటర్ పై దాడికి దిగారు.
- అన్ని క్యూల్లో తోపులాట
- లగేజ్ కౌంటర్‌పై దాడి
- పగిలిన కౌంటర్ అద్దాలు
- పలువురు భక్తులకు గాయాలు
- అధికారులు చేతులెత్తేయడంతో కట్టలు తెంచుకున్న ఆగ్రహం
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీకి తగ్గట్టుగా సదుపాయాలు కల్పించలేక టీటీడీ అధికారులు చేతులెత్తేశారు. అన్ని చోట్లా గందరగోళ పరిస్థితి ఏర్పడి భక్తులు నలిగిపోయారు. దాంతో మూకుమ్మడిగా ఏటీసీ లగేజీ కౌంటర్ పై దాడికి దిగారు. కౌంటర్ అద్దాలు పగులగొట్టారు. పలువురు భక్తులకు రక్తగాయాలయ్యా యి. అధికారులు, సిబ్బందిపై భక్తులు శాపనార్థాలు పెడుతూ తమ ఆవేదన వ్యక్తపరిచారు. శనివారం తరహాలోనే ఆదివారం కూడా అన్ని క్యూల్లోనూ తోపులాటలు జరిగాయి.
భక్తులను టీటీడీ అధికారులు పట్టించుకోలేదు. ఆదివా రం క్యూ నిర్వహణ సజావుగా సాగలేదు. లగే జీ డిపాజిట్ చేసేందుకు తగిన సిబ్బంది లేకపోవడంతో తీవ్రజాప్యం జరిగింది. సర్వదర్శనం, కాలిబాట క్యూలో అడుగడుగునా తోపులాట లు జరిగాయి. ఆలయంలో పలువురు భ క్తులు కింద పడ్డారు. క్షణకాలం కూడా శ్రీవారిని దర్శించకుండానే భక్తులు వెనుదిరిగారు.
టీటీడీ రికార్డుల వేట:గతంలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ అధికారులు వ్యక్తిగత ప్రతిష్ట కోసం రికార్డుల కోసం పాకులాడుతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.
టీటీడీ చరిత్రలోనే రికార్డు స్థాయిలో శనివారం 1,00,719 మంది భక్తులకు దర్శనం కల్పించామని అధికారులు మీడియా ముందు ఆనందం వ్యక్తం చేశారు. ఒక్క రోజులోనే పరిస్థితి మారిపోయింది. ఆలయంలో ప్రస్తుతం అమలవుతున్న మూడు క్యూల విధానం వల్ల కనీసం 90 వేల మందికి కూడా దర్శనం కల్పించలేని పరిస్థితి ఉంది. వచ్చిన భక్తుల్లో 80 శాతానికి పైగా దేవుడిని క్షణకాలం కూడా దర్శించే అవకాశం లేకుండా పోయిందని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు.