భారీ వర్షం.. ఆపరేషన్‌కు ఆటంకం

Devipatnam Boat Capsized Operation Search Obstructed Due To Heavy Rain - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : కచ్చలూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు ధర్మాడి సత్యం బృందం చేస్తున్న ప్రయత్నాలు మూడోరోజు కూడా విఫలమయ్యాయి. మంగళవారం(రెండోరోజు) సత్యం బృందం గోదావరిలో 1000 మీటర్లకు పైగా ఐరన్‌ రోప్‌ను దింపి ప్రొక్లైయిన్‌ సహాయంతో బోటును వెలికి తీసే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐరన్‌ రోప్‌ బండరాయికి తగిలి తెగిపోయింది. దీంతో యాంకర్లు వేసి బోట్‌ ఆచూకి కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఈరోజు ఉదయం నుంచి బోటు వెలికితీత పనుల్లో నిమగ్నమైన సత్యం బృందానికి వర్షం అడ్డంకిగా మారింది. మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులతో కూడా భారీ వర్షం కురవడంతో ఆపరేషన్‌కు అంతరాయం కలిగింది. గోదావరిలో నీటి స్థాయి మూడు అడుగులు పెరిగినట్లుగా భావించడంతో ప్రస్తుతానికి వెలికితీత పనులను నిలిపివేశారు. కాగా పాపికొండల విహారానికి బయల్దేరిన ఎన్నో కుటుంబాలకు పడవ ప్రమాదం విషాదం మిగిల్చిన విషయం విదితమే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top