'స్వర్గపురి' పేరుతో శ్మశాన వాటికల అభివృద్ధికి డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో శుక్రవారం శ్రీకారం చుట్టారు.
సత్తెనపల్లి (గుంటూరు) : 'స్వర్గపురి' పేరుతో శ్మశాన వాటికల అభివృద్ధికి డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో శుక్రవారం శ్రీకారం చుట్టారు. దీనిపై మార్కెట్ యార్డ్‌లో జరిగిన సమావేశంలో ఏడు కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకున్నారు.
ఈ కార్యక్రమం కింద శ్మశానాల్లో రోడ్లు, దుస్తులు మార్చుకునే గది, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఒక్క సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలో 111 శ్మశానాల్లో 'స్వర్గపురి' అమలు చేయనున్నామని చినరాజప్ప తెలిపారు.