డిసెంబర్‌ 6 వరకు గడువు: ముద్రగడ | December 6 is the deadline: mudragada | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 6 వరకు గడువు: ముద్రగడ

Sep 16 2017 1:16 AM | Updated on Jul 30 2018 7:57 PM

డిసెంబర్‌ 6 వరకు గడువు: ముద్రగడ - Sakshi

డిసెంబర్‌ 6 వరకు గడువు: ముద్రగడ

రాష్ట్రంలో కాపు ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించినప్పటికీ..

అమలాపురం టౌన్‌: రాష్ట్రంలో కాపు ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించినప్పటికీ.. ప్రభుత్వ స్పందన ఆధారంగా ఉద్యమం కొనసాగింపునకు పక్కా ప్రణాళికతో ఉన్నామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టంచేశారు. ‘డిసెంబర్‌ ఆరో తేదీ వరకూ గడువు విధించుకున్నాం. అప్పటికి మా జేఏసీ రెండు ఆప్షన్లు పెట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి సానుకూల స్పందన ఉంటే సరేసరి. మళ్లీ మొండిచేయి చూపిస్తే ఆ రెండు ఆప్షన్లలో ఒకటి ఎంచుకుంటాం’ అని ఆయన స్పష్టంచేశారు.

అయితే, ఆ రెండు ఆప్షన్లు ఏమిటనేది ఆయన వెల్లడించలేదు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో రాష్ట్ర కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి నివాసంలో శుక్రవారం మీడియాతో ముద్రగడ మాట్లాడారు. ‘మా కాపు జాతి లక్ష్యం ఒక్కటే.. రిజర్వేషన్లు కల్పించాలి. బీసీల్లో చేర్చాలి. ఉద్యమంపై ఎన్ని ఉక్కుపాదాలు మోపినా మడమ తిప్పకుండా పోరాడతాం’ అని ప్రకటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement