
దండకారణ్యం ఆడియో ఆవిష్కరణ నేడు
‘దండకారణ్యం’ తెలుగు చలన చిత్రం ఆడియో ఆవిష్కరణ శ్రీకాకుళం ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఉదయం 10 గంటలకు...
పాత శ్రీకాకుళం: ‘దండకారణ్యం’ తెలుగు చలన చిత్రం ఆడియో ఆవిష్కరణ శ్రీకాకుళం ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్టు మానవ హక్కుల వేదిక ఉపాధ్యక్షుడు కేవీ జగన్నాథరావు తెలిపారు. ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కార్యక్రమానికి దండకారణ్యం చిత్ర హీరో, దర్శకత్వం వహించిన ఆర్. నారాయణమూర్తి హాజరవుతారని తెలిపారు. ఆదివాసుల సమస్యలు, వారి జీవన విధానం, నిర్వాసితుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ చిత్రంలో చూపించారని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రజా గాయకుడు గద్దర్, గోరేటి వెంకన్న పాటలు రాశారని, కార్యక్రమానికి అన్ని వర్గాలకు చెందిన వారు హాజరు కావాలని కోరారు.