
సాక్షి, విశాఖపట్నం : విశాఖ జిల్లాలో పోస్టల్‌బ్యాలెట్ పంపిణీలో అవకతవకంలు జరిగాయని, జిల్లా కలెక్టర్ బాధ్యతారాహిత్యం బయటపడిందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్ర రావు ఆరోపించారు. జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి అన్నట్లు వ్యవహరించడం లేదని, 4 వేలకు పైగా ఉద్యోగులు తమ ఓటు హక్కును కోల్పోయారని అన్నారు. ఇతర జిల్లాలకు భిన్నంగా విశాఖ జిల్లా కలెక్టర్ భాస్కర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇదే తీరు కొనసాగితే కౌంటింగ్‌లో కూడా ఇబ్బందులు ఎదురవుతాయని వివరించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఇచ్చిన పోస్టల్ బ్యాలెట్ వివరాలు కలెక్టర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజు వారీగా సమాచారాన్ని అందరికీ ఇవ్వాలని తెలిపారు. కౌంటింగ్‌ను నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.