అమ్మను నాయనే చంపేశాడు | Dad only killed my mother | Sakshi
Sakshi News home page

అమ్మను నాయనే చంపేశాడు

May 18 2015 3:12 AM | Updated on Apr 3 2019 8:07 PM

అమ్మను నాయనే చంపేశాడని ఏడేళ్ల కుమారుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.

ఏడేళ్ల కుమారుడు వాంగ్మూలం
 
చిల్లకూరు : అమ్మను నాయనే చంపేశాడని ఏడేళ్ల కుమారుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. మండలంలోని బల్లవోలులో శనివారం అనుమానాస్పద స్థితిలో రత్తమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తన తండ్రి ముత్యాలయ్య అమ్మను కిరోసిన్ పోసి కాల్చినట్లు ఆ బాలుడు ఆదివారం పోలీసులకు వివరించాడు. రత్తమ్మ మృతదేహాన్ని డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాసులరెడ్డి పరిశీలించారు. సంఘటన వివరాలను తెలుసుకునేందుకు గ్రామంలో విచారణ చేపట్టారు.

ఈ సందర్భంగా ప్రత్యక్షంగా చూసిన మృతురాలి కుమారుడు ముక్తానంద జరిగిన సంఘటన వివరాలను వివరించాడు. ఈ మేరకు సీఐ శ్రీనివాసులరెడ్డి కేసు నమోదు చేశారు. రత్నమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. మృతురాలి భర్త ముత్యాలయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement