breaking news
Rattamma died
-
విషజ్వరాలతో వణుకుతున్న గ్రామం.. ఒకరి మృతి
సిరివెల్ల: కర్నూలు జిల్లా సిరివెల్ల మండలం వీరారెడ్డి పల్లె వాసులను విషజ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. గ్రామంలో సుమారు 30 మందికి పైగా ఈ ప్రభావంతో మంచం పట్టారు. ఈ క్రమంలో కాకి రత్తమ్మ (30) వైరల్ ఫీవర్తో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి కన్నుమూసింది. పరిస్థితి తీవ్రతతో వైద్య బృందం మంగళవారం గ్రామానికి వచ్చి అనారోగ్యంతో మంచం పట్టిన వారి రక్త నమూనాలను సేకరించి ప్రత్యేక పరీక్షల కోసం పంపారు. -
అమ్మను నాయనే చంపేశాడు
ఏడేళ్ల కుమారుడు వాంగ్మూలం చిల్లకూరు : అమ్మను నాయనే చంపేశాడని ఏడేళ్ల కుమారుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. మండలంలోని బల్లవోలులో శనివారం అనుమానాస్పద స్థితిలో రత్తమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తన తండ్రి ముత్యాలయ్య అమ్మను కిరోసిన్ పోసి కాల్చినట్లు ఆ బాలుడు ఆదివారం పోలీసులకు వివరించాడు. రత్తమ్మ మృతదేహాన్ని డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాసులరెడ్డి పరిశీలించారు. సంఘటన వివరాలను తెలుసుకునేందుకు గ్రామంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రత్యక్షంగా చూసిన మృతురాలి కుమారుడు ముక్తానంద జరిగిన సంఘటన వివరాలను వివరించాడు. ఈ మేరకు సీఐ శ్రీనివాసులరెడ్డి కేసు నమోదు చేశారు. రత్నమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. మృతురాలి భర్త ముత్యాలయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.