పార్లమెంట్‌లోనూ మూజువాణి ఆమోదమే! | D Srinivas has confidence on Telangana bill to pass in Parliament | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లోనూ మూజువాణి ఆమోదమే!

Feb 1 2014 3:04 AM | Updated on Aug 18 2018 4:13 PM

పార్లమెంట్‌లోనూ మూజువాణి ఆమోదమే! - Sakshi

పార్లమెంట్‌లోనూ మూజువాణి ఆమోదమే!

తెలంగాణ బిల్లును ఫిబ్రవరి 10 లోపే పార్లమెంట్‌లో ప్రవేశపెడతారనే సమాచారం తనకుందని, 15 లోపే అది మూజువాణి ఓటుతో ఆమోదం పొందుతుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ బిల్లుపై డీఎస్ ధీమా
హరిహరాదులు అడ్డొచ్చినా  ఆగదు
విభజన వ్యతిరేక తీర్మానం అసెంబ్లీ రికార్డులకే పరిమితం

 
 సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ బిల్లును ఫిబ్రవరి 10 లోపే పార్లమెంట్‌లో ప్రవేశపెడతారనే సమాచారం తనకుందని, 15 లోపే అది మూజువాణి ఓటుతో ఆమోదం పొందుతుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.హరిహరాదులు అడ్డొచ్చినా తెలంగాణ ఆగదని, ఫిబ్రవరిలోనే రెండు రాష్ట్రాల ఏర్పాటు ఖాయమన్నారు. శుక్రవారం ఎమ్మెల్యేల నివాస ప్రాంగణ సముదాయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో తెలంగాణపై ఓటింగ్ ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. విభజన బిల్లుకు, తిరస్కరణ తీర్మానానికి ఎలాంటి సంబంధం లేదుని, ఆ సంగతి శాసనసభ స్పీకర్ చదివిన నోట్‌లోనే స్పష్టంగా ఉందన్నారు.
 ముఖ్యాంశాలు...
     అసలు బిల్లు రాలేదని, ముసాయిదా మాత్రమే వచ్చిందని, బిల్లులో అనేక లొసుగులున్నాయని, చర్చకు మరింత గడువు పెంచాలని, తెలంగాణను అడ్డుకుంటామని కొందరు రకరకాల ప్రకటనలు చేశారు.
     బిల్లును తిరస్కరించాలని కోరిన వారు ఆ బిల్లుపైనే అసెంబ్లీలో చర్చించేందుకు మరో మూడువారాల సమయం కావాలని ఎందుకు అడిగారు?
     అసెంబ్లీలో సభ్యులు చెప్పిన అభిప్రాయాలను మాత్రమే రాష్ట్రపతికి పంపిస్తున్నారు.
     విభజనను తిరస్కరించిన తీర్మానాన్ని పంపడం లేదు. దానిని అసెంబ్లీ రికార్డుల్లోనే నిక్షిప్తం చేస్తారు.
     అసెంబ్లీలో సీమాంధ్రుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున మెజారిటీ అభిప్రాయాలు విభజనకు వ్యతిరేకంగా ఉన్నాయి.    
     అలాంటప్పుడు సీఎం తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముంది?
     దానిని మూజువాణితో ఓటుతో ఆమోదించి ఏకగ్రీవమని చెప్పడమెందుకు?
     రాజ్యాంగ పరంగా జరుగుతున్న విభజన ప్రక్రియపై న్యాయస్థానం జోక్యం చేసుకోదు.
     టీఆర్‌ఎస్ అభ్యర్థికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటేసే సంగతి హైకమాండ్ నిర్ణయిస్తుంది.
     {పత్యేక రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆరే చెప్పారు.
     అలాంటప్పుడు విలీనం కావడానికి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. ‘వేరే ఎజెండా’ లేనప్పుడు విలీనమే సరైనది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement