రుణాల పంపిణీలో రాజకీయ జోక్యం నివారించాలని ఐక్య మాదిగ సమాజ్ (ఐఎంఎస్) ఆధ్వర్యంలో....
ఐఎంఎస్ ఆధ్వర్యంలో పెన్నార్ భవనం ఎదుట ధర్నా
అనంతపురం ఎడ్యుకేషన్: రుణాల పంపిణీలో రాజకీయ జోక్యం నివారించాలని ఐక్య మాదిగ సమాజ్ (ఐఎంఎస్) ఆధ్వర్యంలో మంగళవారం పెన్నార్ భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. ఐఎంఎస్ అధ్యక్షులు వెంకటేశు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు జీఓ 25 మేరకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు సక్రమంగా ఖర్చు చేయాలని కోరారు. 2015-16 విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్నా ప్రీ మెట్రిక్, పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కాక చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు.
కార్యక్రమంలో ఐఎంఎస్ జిల్లా అధ్యక్షులు మల్లేసు, కార్యదర్శి శంకర్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టి.లక్ష్మీ, నాయకులు వరలక్ష్మీ, రాణి, ఓబులేసు, గోపాల్, వెంకటరాముడు, రాము, గిరమ్మ, సుంకమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.