'ప్రతిపక్ష పార్టీ వాళ్లను నిస్సిగ్గుగా చేర్చుకుంటున్నారు' | Sakshi
Sakshi News home page

'ప్రతిపక్ష పార్టీ వాళ్లను నిస్సిగ్గుగా చేర్చుకుంటున్నారు'

Published Sun, Jun 21 2015 1:08 PM

cpi ramakrishna fires telugu state chief ministers

విజయవాడ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్ష పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నిస్సిగ్గుగా చేర్చుకుంటున్నాయని సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆడియో టేపుల్లో ఉన్నది ఏపీ సీఎం చంద్రబాబు వాయిసే అయితే వెంటనే పదవికి రాజీనామా చేసి విచారణకు సిద్ధమవ్వాలని సూచించారు. కేసీఆర్, చంద్రబాబు డబ్బు రాజకీయాలు చేస్తున్నారని రామకృష్ణ వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ మీడియాను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. మీడియాను నియంత్రించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రామకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement