పీఎస్ఎల్వీ కౌంట్డౌన్ ప్రారంభం | countdown started for pslv-c24 | Sakshi
Sakshi News home page

పీఎస్ఎల్వీ కౌంట్డౌన్ ప్రారంభం

Apr 2 2014 8:30 AM | Updated on Jun 4 2019 6:31 PM

పీఎస్ఎల్వీ కౌంట్డౌన్ ప్రారంభం - Sakshi

పీఎస్ఎల్వీ కౌంట్డౌన్ ప్రారంభం

భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న పీఎస్ఎల్వీ -సి24కు కౌంట్‌డౌన్‌ ప్రారంభం అయ్యింది.

భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న పీఎస్ఎల్వీ -సి24కు కౌంట్‌డౌన్‌ ప్రారంభం అయ్యింది. బుధవారం ఉదయం 6.44 గంటలకు ఈ కౌంట్డౌన్ మొదలైంది. మొత్తం 58 గంటల 30 నిమిషాలపాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రంలో రాకెట్ కు సంబంధించిన అన్ని అంశాలనూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

నాలుగో తేదీ శుక్రవారం సాయంత్రం 5.14 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి24 నింగిలోకి వెళ్లనుంది. దీని సాయంతో ఐఆర్ఎన్ఎస్ఎస్1-బి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. పీఎస్ఎల్వీ భారత అంతరిక్ష చరిత్రలో గెలుపుగుర్రంగా నిలిచింది. ఇప్పటివరకు దీని వైఫల్యాలు చాలా తక్కువ, విజయాల శాతం చాలా ఎక్కువగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement