కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా | contract employees strike for salaries in macharla | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా

Feb 20 2015 10:24 AM | Updated on Sep 2 2017 9:38 PM

గత మూడు నెలలుగా జీతాలు చెల్లించటంలేదని కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నాకు దిగారు.

మాచర్ల : గత మూడు నెలలుగా జీతాలు చెల్లించటంలేదని కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల పురపాలక సంఘంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. మాచర్ల పురపాలక సంఘం ఇంజనీరింగ్ సెక్షన్‌లో పనిచేసే 55 మంది ఒప్పంద కార్మికులకు మూడు నెలలుగా జీతాలందటంలేదు.

దీంతో శుక్రవారం సీఐటీయూ అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మాచర్ల పురపాలక సంఘ కార్యలయం ఎదుట ఒప్పంద కార్మికులు ధర్నాకు దిగారు. వెంటనే జీతాలు చెల్లించాలని, పీఎఫ్‌కు నగదు చెల్లించాలని కోరారు. అకారణంగా తొలగించిన ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement