రాజ్‌భవన్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Constitution Day Celebration In AP Raj Bhavan - Sakshi

సాక్షి, అమరావతి : భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి నేటికి 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాజ్‌భవన్‌లో  రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ జ్యోతి ప్రజ్వలన చేసి రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ జితేంద్ర కుమార్ మహేశ్వరి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ విశ్వభూషన్‌ , మంత్రులు అబ్కేద్కర్‌ చిత్ర పటానికి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా గవర్నర్‌ గవర్నర్‌ భిశ్వభూషన్‌ హరిచందన్‌ మాట్లాడుతూ.. రాజ్యాంగం అందరికి సమాన హక్కులు కల్పించిందని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. దేశ సమగ్రత దెబ్బతీసే విధమైన చర్యలను ఉపేక్షించకూడదన్నారు. హక్కులకు భంగం కలిగితే ఎవరైనా కోర్టుకు వెళ్లొచ్చునని సూచించారు. ‘న్యాయ వ్యవస్థ, పాలనా వ్యవస్థలు ప్రజలకు రక్షణా ఉంటాయి. సమస్యలు ఎన్నిఉన్నా.. పౌరులు తమ హక్కులను పరిరక్షించడమే కాకుండా వారి బాధ్యతలను నిర్వర్తించాలి. స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ చేసి  అహింసా పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలి’  అని గవర్నర్‌ అన్నారు. 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ.. రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగం అందరికీ ఆదర్శమని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ప్రాధమిక హక్కులు ఉండాలని ఆకాంక్షించారు. బడుగు, బలహీన వర్గాలకు మెరుగైన విద్యను అందించడం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపడం బాధ్యతగా భావించాలని కోరారు. అందుకే ప్రభుత్వం అమ్మఒడి కార్యక్రమం ద్వారా అమ్మలకు చేయూతను ఇస్తుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా అత్యాధునిక వైద్య సేవలను అందిస్తున్నామని చెప్పారు.


మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని రూపొందించి అంటరానితనం రూపుమాపేందుకు కృషి చేశారని ప్రశంసించారు. అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టో తయారు చేశారన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. నవరత్నాలు ద్వారా అన్ని వర్గాల పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు. అవినీతి లేని ఆంధ్రప్రదేశ్‌గా అభివృద్ధి చేయడమే సీఎం జగన్‌ లక్ష్యమని, ఆ దిశగా పాలన సాగిస్తున్నారని ప్రశంసించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top