వలస కూలీల ఓట్ల పాట్లు...

Considering The Right to Vote is Their Responsibility - Sakshi

సాక్షి, కర్నూల్‌ (ఆస్పరి) : ఈ రోజుల్లో ఉన్నత విద్యావంతులకు కూడా ఓటు హ​క్కును ఉపయోగించుకోవాలంటే నామోషి.. ఆఫీసులు ఆ రోజు సెలవునిస్తే సినిమాలకు, పబ్బులకు వెళ్లి సరదాగా కాలక్షేపం చేస్తున్నారు... మరోవైపు వారికి చదువు రాదు.. పొట్టచేత బట్టుకుని వలస వెళ్లారు.. కానీ వారికి ఓటు విలువ తెలుసు. ఓటు హక్కును వినియోగించుకోవడం తమ బాధ్యతగా భావించి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి సొంతూరు పయణమయ్యారు.. 

వర్షాభావం కారణంగా పంటలు ఎండిపోయి పనులు లేకపోవడంతో బతుకుతెరువు కోసం దూర ప్రాంతాలకు వలస వెళ్లిన మండల పరిధిలోని తంగరడోణ, ములుగుందం, బనవనూరు, కైరుప్పల, తొగలుగల్లు, యాటకల్లు, హలిగేర, చిరుమాన్‌దొడ్డి, శంకరబండ తదితర గ్రామాలకు చెందిన కూలీలు మిర్చి కోత పనుల కోసం  రెండు, మూడు నెలల క్రితం గుంటూరు వెళ్లారు. ఈ రోజు పోలింగ్‌ ఉండడంతో దూర ప్రాంతాల్లోని వారంతా లారీలు, రైళ్లు, బస్సులు ఇతర ప్రత్యేక వాహనాల్లో సొంతూరు వస్తున్నారు. మండల పరిధిలోని తంగరడోణకు చెందిన కూలీలు గుంటూరు నుంచి ఆల్విన్‌ వాహనంలో సొంతూరు వచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top