ట్యాపింగ్ పై ఏపీ నేతల నుంచి ఫిర్యాదులు | Complaints from AP Leaders on the Tapping | Sakshi
Sakshi News home page

ట్యాపింగ్ పై ఏపీ నేతల నుంచి ఫిర్యాదులు

Nov 30 2016 1:54 AM | Updated on Aug 9 2018 4:39 PM

ట్యాపింగ్ పై ఏపీ నేతల నుంచి ఫిర్యాదులు - Sakshi

ట్యాపింగ్ పై ఏపీ నేతల నుంచి ఫిర్యాదులు

తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఏపీ ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులందాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

వైఎస్సార్‌సీపీ ఎంపీ మేకపాటి ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం

 సాక్షి, న్యూఢిల్లీ: తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఏపీ ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులందాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని ప్రజాప్రతినిధుల నుంచి ఏమైనా ఫిర్యాదులొచ్చాయా అని లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ పక్షనేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రశ్నించగా.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్‌‌సరాజ్ గంగారాం మంగళవారం సమాధానమిచ్చారు.

ఏపీ ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, వీటిపై వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అవి హైకోర్టులో న్యాయవిచారణలో ఉన్నాయని మంత్రి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement