విశాఖపట్నంలో ఉప వాణిజ్య పన్నుల అధికారి(డీసీటీఓ)గా పనిచేస్తున్న కమలారావు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి చిక్కారు.
పెదవాల్తేరు : విశాఖపట్నంలో ఉప వాణిజ్య పన్నుల అధికారి(డీసీటీఓ)గా పనిచేస్తున్న కమలారావు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళ్తే... వన్‌టౌన్ ప్రాంతంలోని శ్రీనివాస్ జ్యూయెలరీ షాప్‌పై లోగడ నిర్వహించిన సోదాలకు సంబంధించి ఎసెస్‌మెంట్ ఇవ్వడం కోసం ఆయన రూ.3 లక్షలు డిమాండ్ చేశారు. రూ.1.50లక్షలు లంచం ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. అయితే షాపు యజమాని శ్రీనివాసరావు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు చేరవేశాడు. కాగా సోమవారం ఉదయం శ్రీనివాసరావు నుంచి రూ.1.50లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు డీసీటీవో కమలారావును పట్టుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు.