
పూరింట్లో కలెక్టర్
గజపతినగరం : ఇక్కడ పూరింట్లో మంచంపై కూర్చున్నదెవరో తెలుసా... సాక్షాత్తూ జిల్లా కలెక్టరే. గజపతినగరం మండలంలో పర్యటనకు వచ్చిన ఆయన అక్కడి దిగువ వీధిలో ఉన్న హాస్టళ్లను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆ దారి లో గంట్రేటి లక్ష్మి అనే వృద్ధురాలు కలెక్టర్ హరిజవహర్ లాల్‌ను కలసి తాను నివాసం ఉంటున్న ఇంటి కి పట్టా ఇప్పించాలని ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా న్యాయం జరగలేదని చెప్పగా వెంటనే ఆయన ఆమె గుడిసెలోకి వెళ్లి మంచంపై కూ ర్చుని ఆమె కష్టసుఖాలు తెలుసుకున్నారు. అంతేగాదు తహసీల్దార్ శేషగిరికి ఫోన్ చేసి తక్షణమే ఆమెకు పట్టామంజూరు చేయాలని ఆదేశించారు. దీంతో ఆమె ఉబ్బి తబ్బిబ్బయ్యింది.