సీఎం జగన్‌ ఏడాది పాలన: ప్రత్యేక సదస్సులు | CM YS Jagan Special Seminars On One Year Rule | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ ఏడాది పాలన: ప్రత్యేక సదస్సులు

May 22 2020 9:53 PM | Updated on May 22 2020 9:59 PM

CM YS Jagan Special Seminars On One Year Rule - Sakshi

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయకుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు రోజుల పాటు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నారు.
(రుణపడి ఉంటాం.. థాంక్యూ జగనన్న)

30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం..
25న పరిపాలన సంస్కరణలు-సంక్షేమం, 26న వ్యవసాయం-అనుబంధ రంగాలు, 27న విద్యారంగం సంస్కరణలు-పథకాలు, 28 న పరిశ్రమలు-పెట్టుబడుల రంగం, 29న వైద్య ఆరోగ్య రంగం సంస్కరణలు-పథకాలపై సదస్సులు నిర్వహించనున్నారు. 30న  రైతు భరోసా కేంద్రాలను సీఎం వైఎస్‌ జగన్ ప్రారంభించనున్నారు.

ఆన్‌లైన్‌ పద్దతిలో..
ఆన్ లైన్ పద్దతిలో సదస్సులను ప్రభుత్వం నిర్వహించనుంది. సదస్సుల్లో ప్రతి రోజు సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు. జిల్లా స్థాయిలో ఇంచార్జ్ మంత్రి, మంత్రులు, లబ్ధిదారులతో  సదస్సులు జరగనున్నాయి. భౌతిక దూరం పాటిస్తూ 50 మంది మాత్రమే పాల్గొనాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement