
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. ఆదివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘కరోనా’పై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. అనంతరం నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్‌తో సమావేశమయ్యారు. గంటకుపైగా గవర్నర్‌తో చర్చించిన సీఎం జగన్ అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. స్థానిక ఎన్నికల వాయిదా, కరోనా నివారణ చర్యలపై గవర్నర్‌తో చర్చించినట్లు సమాచారం. మరికాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ మీడియాతో మాట్లాడనున్నారు.
(చదవండి : ‘కరోనా’ పై సీఎం జగన్ సమీక్ష)
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఏపీలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ప్రకటించారు.