మహిళల రక్షణకు ‘దిశా’నిర్దేశం

CM YS Jagan to launch Disha police station at Rajamahendravaram - Sakshi

నేడు రాజమహేంద్రవరంలో ‘దిశ పోలీస్‌ స్టేషన్‌’ను ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

రాష్ట్రంలో 18 దిశ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటు

దేశానికే ఆదర్శంగా చట్టాన్ని తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: ‘దిశ’ చట్టాన్ని తెచ్చి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బాధిత మహిళలకు సత్వర న్యాయం చేసేందుకు అంతే వేగంగా చర్యలు చేపడుతోంది.  రాజమహేంద్రవరంలో ‘దిశ’ తొలి పోలీస్‌ స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించనున్నారు. అనంతరం నన్నయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో పోలీసులు, న్యాయవాదులతో జరిగే సదస్సులో మాట్లాడతారు. ఈ సందర్భంగా దిశ యాప్‌ను కూడా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటవుతాయి. ఒక్కో స్టేషన్‌లో డీఎస్పీలు, సీఐలు ఇద్దరు, ఐదుగురు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం 52 మంది పోలీస్‌ సిబ్బంది ఉంటారు. దిశ చట్టంపై అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐఏఎస్‌ అధికారిణి కృతికా శుక్లా, ఐపీఎస్‌ అధికారి దీపికను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది. ఆంధ్రప్రదేశ్‌లో తెచ్చిన దిశ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని ఢిల్లీ, మహారాష్ట్ర ప్రకటించడం గమనార్హం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top