రాజధాని అమరావతికి మకుటాయమానంగా నిలవనున్న సప్త రహదారులను ఏడాదిలోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఏడు రహదారులకు సీఎం శంకుస్థాపన
మంగళగిరి: రాజధాని అమరావతికి మకుటాయమానంగా నిలవనున్న సప్త రహదారులను ఏడాదిలోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ఏడు రహదారులతో అమరావతి రూపురేఖలు మారతాయన్నారు. ఒక్కో రోడ్డు అమరావతి నగరానికి వడ్డాణం, నెక్లెస్, డైమండ్‌లా ఉంటాయన్నారు. అమరావతికి అనుసంధానంగా నిర్మించనున్న ఏడు రోడ్లకు బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని యర్రబాలెం గ్రామంలో ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరం గసభలో మాట్లాడుతూ.. అమరావతిని కలుపుతూ తూర్పు పడమర దిశలలో మూడు రోడ్లు, ఉత్తర, దక్షిణాలను కలుపు తూ నాలుగురోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. రాజధానికి ఉండవల్లి, పెనుమాక, నిడ మర్రు గ్రామాలకు చెందిన రైతులు సహరించకపోవడం బాధాకరమన్నారు.
ఏడాదిలో దేవాన్ష్ ఆడుకునేలా చేస్తా..
అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీపార్థసారథి మాట్లాడుతూ విజయవాడలో కానీ రాజధానిలో కానీ చంద్రబాబు మనుమడు దేవాన్ష్ ఆడుకునేందుకు అవకాశం లేదని, ఏడాదిలో రహదారులు, పార్కులు పూర్తిచేసి దేవాన్ష్ ఆడుకునేలా చేస్తానని అన్నారు.