సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు | CM Chandrababu Naidu tour finalized | Sakshi
Sakshi News home page

సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు

Jul 30 2014 12:12 AM | Updated on Aug 24 2018 2:36 PM

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా పర్యటన ఖరారైంది. వచ్చే నెల 6, 7 తేదీల్లో ఆయన జిల్లాలో పర్యటించనున్నారు.

సాక్షి, గుంటూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా పర్యటన ఖరారైంది. వచ్చే నెల 6, 7 తేదీల్లో ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అన్ని శాఖల అధికారులను ఆదేశిం చారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
 
 6వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి గుంటూరు చేరుకుంటారు. వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం పొన్నూరులో డ్వాక్రా మహిళలతో సమావేశమవుతారు. సాయంత్రం గుంటూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష చేస్తారు. రాత్రికి గుంటూరులోనే బస చేస్తారు.
 
 7న ఉదయం మళ్లీ వివిధ పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు.మధ్యాహ్నం జిల్లాలోని ఏదోఒక నియోజకవర్గంలో రైతులతో ముఖ్యమంత్రి సమా వేశమవుతారు. ఈ కార్యక్రమం ఎక్కడ అనేది ఇంకా నిర్ణయించలేదు.
 
 ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశంలో సూచించారు. ఈ సమీక్షలో డీఆర్వో కె.నాగబాబు, కమిషనర్ నాగవేణి, డ్వామా, డీఆర్‌డీఏ పీడీలు ఢిల్లీరావు, ప్రశాంతి, పీఆర్ ఎస్‌సీ సూర్యనారాయణతోపాటు జిల్లాలోని అన్ని ముఖ్య శాఖల అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement