రాజకీయాల్లోనూ వందరోజుల పండుగ: చిరు | chiranjeevi slams andhra pradesh cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోనూ వందరోజుల పండుగ: చిరు

Sep 20 2014 2:38 PM | Updated on Mar 18 2019 9:02 PM

రాజకీయాల్లోనూ వందరోజుల పండుగ: చిరు - Sakshi

రాజకీయాల్లోనూ వందరోజుల పండుగ: చిరు

రాజకీయాల్లోనూ వంద రోజుల పండుగ సంప్రదాయం వచ్చిందని కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి వ్యాఖ్యానించారు.

ఏలూరు : రాజకీయాల్లోనూ వంద రోజుల పండుగ సంప్రదాయం వచ్చిందని కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ సినిమాల్లో లాగా వంద రోజులు తర్వాత  బొమ్మ ఎక్కడ తీసేస్తారోనని ...ముందుగానే పండుగ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో చక్రం తిప్పుతానన్న చంద్రబాబు ఎక్కడ చక్కర్లు కొడుతున్నారని చిరంజీవి ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామన్నారు. జన్మభూమి కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement