పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు.
గన్నవరం : పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 50 రోజుల అనంతరం ఆయన తొలిసారి జిల్లాలో పర్యటిస్తున్నారు. కాగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి జిల్లా ఫలితాలే కీలకం... 'నాకు అన్ని జిల్లాలు ఓ ఎత్తు... పశ్చిమ గోదావరి జిల్లా ఓ ఎత్తు' అంటూ పలు సందర్భాల్లో చంద్రబాబు బహిరంగంగానే వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇప్పుడు సీఎంగా ఆయన తొలి పర్యటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.