‘బాబు బ్రాహ్మణులను చులకనగా చూస్తున్నారు’ | chandrababu naidu humiliated the Brahmin community, says ysrcp mla kona raghupathi | Sakshi
Sakshi News home page

‘బాబు బ్రాహ్మణులను చులకనగా చూస్తున్నారు’

Jul 15 2017 2:51 PM | Updated on May 29 2018 3:48 PM

‘బాబు బ్రాహ్మణులను చులకనగా చూస్తున్నారు’ - Sakshi

‘బాబు బ్రాహ్మణులను చులకనగా చూస్తున్నారు’

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాహ్మణులను చులకనగా చూస్తున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు.

కర్నూలు :  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాహ్మణులను చులకనగా చూస్తున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. ఆయన శనివారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజకీయ స్వార్థం కోసమే నంద్యాలకు నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు.

బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు ఇస్తామని చెప్పి, కనీసం రూ.100 కోట్లు కూడా కేటాయించలేదని కోన రఘుపతి వ్యాఖ్యానించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.500 కోట్లు ఇస్తామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలోనే పెట్టిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ తొలి ఏడాది రూ.25 కోట్లు, 2015-16లో రూ.35 కోట్లు ఇచ్చి బ్రాహ్మణులను  ప్రభుత్వం మోసం చేసిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement