రుణమాఫీపై రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మం త్రులు, బ్యాంకు అధికారులు తలో విధంగా మాట్లాడి రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర విమర్శించారు.
సాలూరు : రుణమాఫీపై రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మం త్రులు, బ్యాంకు అధికారులు తలో విధంగా మాట్లాడి రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర విమర్శించారు. స్పష్టత లేని రుణమాఫీపై టీడీపీ నాయకులు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. శనివారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. సీఎం రుణమాఫీ చేసేశామని, వ్యవసాయ శాఖా మంత్రి రైతులు ముందు డబ్బులు కట్టేస్తే ఆ తరువాత ఇచ్చేస్తామని.. అలా అయితేనే కొత్త రుణాలు ఇస్తామని చె బుతున్నారన్నారు.
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మాత్రం రుణమాఫీ సాధ్యం కాదని, అవసరమైతే బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ అధికారులతో మాట్లాడుకోవాలని సూచిస్తున్నారన్నారు. ఇలా తలో విధంగా మాట్లాడుతుండడంతో రైతులు గందరగోళానికి గురవుతున్నారని చెప్పారు. రుణాల రీషెడ్యూల్ వల్ల రైతులకు నష్టమే తప్ప లాభం లేదన్నారు. రీషెడ్యూల్ అర్థం తెలి స్తే సంబరాలకు బదులు ప్రభుత్వంపై సమరం చేస్తారన్నా రు. రైతులతో పాటు మహిళా సంఘాలను కూడా ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. రైతులు, మహిళలకు న్యాయం జరి గే వరకూ వారి తరుఫున పోరాటం చేస్తామని చెప్పారు.