ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానంటూ సాధారణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు.
బాబు ఎన్నికల మెజీషియన్
Feb 28 2017 2:52 PM | Updated on Aug 29 2018 6:26 PM
అనంతపురం: ఎన్నికల వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు బూటకపు వాగ్దానాలతో ప్రజలను ఒక మెజీషియన్ లా భ్రాంతిలోకి, నెట్టి పబ్బం గడుపుకుంటారని డీవైఎఫ్‌ఐ నగర అధ్యక్షుడు వై.బాలకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానంటూ సాధారణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు.
అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా హామీలు అమలు చేయలేదన్నారు. ఇప్పుడు పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోమారు తన బూటకపు మాటలతో పట్టభద్ర నిరుద్యోగ యువత ఓట్లను దక్కించుకోవాలని చూస్తున్నారన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబుకి తగిన రీతిలో గుణపాఠం చెప్పాలన్నారు.
Advertisement
Advertisement