ఘనంగా ఏపీ మంత్రి సునీత కుమారుడి వివాహం

Chandrababu and KCR to visit Anantapur district for Paritala sriram wedding

నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

అనంతపురం: ఏపీ  స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్‌ వివాహం ఆదివారం అనంతపురం జిల్లా రామగిరి మండలం వెంకటాపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరై శ్రీరామ్, జ్ఞాన దంపతులను ఆశీర్వదించారు.  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ కలుసుకుని కరచాలనం చేసుకున్నారు. తర్వాత కేసీఆర్‌ వేదిక వద్దకు వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. 

Back to Top