'జగన్‌ బెయిల్‌ను అడ్డుకునేందుకే బాబు ఢిల్లీ యాత్ర' | Chandra babu Naidu's Delhi's trip meant to stall bail to YS Jagan: Konatala Ramakirshna | Sakshi
Sakshi News home page

'జగన్‌ బెయిల్‌ను అడ్డుకునేందుకే బాబు ఢిల్లీ యాత్ర'

Sep 15 2013 10:19 AM | Updated on Jul 28 2018 7:54 PM

'జగన్‌ బెయిల్‌ను అడ్డుకునేందుకే బాబు ఢిల్లీ యాత్ర' - Sakshi

'జగన్‌ బెయిల్‌ను అడ్డుకునేందుకే బాబు ఢిల్లీ యాత్ర'

వైఎస్ జగన్‌ బెయిల్‌ను అడ్డుకనేందుకే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణ ఆరోపించారు.

వైఎస్ జగన్‌ బెయిల్‌ను అడ్డుకనేందుకే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణ ఆరోపించారు. కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని చంద్రబాబు కుటిల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఆత్మగౌరవ యాత్ర చేస్తున్న టీడీపీ అధినేత సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని చెప్పకపోవడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.

జగన్‌ను ఎదుర్కొనే సాహసం చేయలేక కాంగ్రెస్‌, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని కొణతాల ఆరోపించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ఎవరు ప్రయత్నించినా, దాన్ని గట్టిగా వ్యతిరేకించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుందని అంతకుముందు చెప్పారు. రాష్ట్ర సమైక్యతను కాపాడటమే లక్ష్యంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు షర్మిల ‘సమైక్య శంఖారావం’ పేరుతో బస్సుయాత్ర చేపట్టినట్టు చెప్పారు. విశాఖపట్నం నగరంలో నేడు షర్మిల బస్సుయాత్ర సాగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement