టీటీడీ ఛైర్మన్ గా చదలవాడ | chadalavada krishnamurthy to be new ttd chairman | Sakshi
Sakshi News home page

టీటీడీ ఛైర్మన్ గా చదలవాడ

Apr 11 2015 4:39 PM | Updated on Aug 25 2018 7:16 PM

టీటీడీ ఛైర్మన్ గా చదలవాడ - Sakshi

టీటీడీ ఛైర్మన్ గా చదలవాడ

తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) ఛైర్మన్ గా తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి నియమితులయ్యారు.

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) ఛైర్మన్ గా తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు చదలవాడ పేరును ఖరారు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చదలవాడ కృష్ణమూర్తిని బోర్డు ఛైర్మన్ గా నియమించారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఆదివారం లోగా వెలువడనున్నాయి. కాగా,18మంది సభ్యులతో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఒక్కొక్కరిని బోర్డు సభ్యులుగా నియమించనున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రం నుంచి బోర్డు సభ్యునిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నియమితులైన విషయం తెలిసిందే.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement