25న విశాఖకు కేంద్రం బృందం రాక | central officials are comes to vishakha on 25 | Sakshi
Sakshi News home page

25న విశాఖకు కేంద్రం బృందం రాక

Nov 13 2014 1:37 AM | Updated on May 3 2018 3:17 PM

హుద్‌హుద్ తుపాను వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ నెల 25న కేంద్ర అధికారుల బృందం జిల్లాకు రానుంది.

విశాఖపట్నం(సిరిపురం): హుద్‌హుద్ తుపాను వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ నెల 25న కేంద్ర అధికారుల బృందం జిల్లాకు రానుంది. జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ ఈ విషయం తెలిపారు. 9మంది సభ్యులు రెండు బృందాలుగా తుపానుప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తారన్నారు.

బుధవారం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. తొలిరోజు తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలు, ఆస్తి నష్టాలకు సంబంధిం చిన ఫోటోల చిత్రప్రదర్శన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బృందం పర్యటించే ప్రాంతాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement