ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నీ తప్పకుండా అమలవుతాయని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత సహాయ మంత్రి తవార్ చంద్ గెహ్లాట్ తెలిపారు.
నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నీ తప్పకుండా అమలవుతాయని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత సహాయ మంత్రి తవార్ చంద్ గెహ్లాట్ తెలిపారు. సోమవారం ఆయన నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించేందుకు ఆంధ్రప్రదేశ్ సహకారం అవసరమన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై వెంకయ్యనాయుడు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు ఏమి చేయాలో అవి తప్పకుండా చేస్తారని స్పష్టం చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ వికలాంగ విద్యార్థులకు విదేశాలల్లో చదువుకునేందుకు అతి తక్కువ వడ్డీపై రూ.30 లక్షల రుణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నంలో జాతీయ వికలాంగుల కేంద్రాన్ని రూ. 50 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా నెల్లూరులో మానసిక వికలాంగుల పునరావస కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని సేకరించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు.