కంతనపల్లి ప్రాజెక్ట్‌పై కేంద్రం కొర్రీ ! | Center breaks to Kanthanapally Project | Sakshi
Sakshi News home page

కంతనపల్లి ప్రాజెక్ట్‌పై కేంద్రం కొర్రీ !

Sep 20 2013 3:41 AM | Updated on Sep 1 2017 10:51 PM

కంతనపల్లి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కొత్త కష్టాలు వచ్చాయి. పదేళ్లలో ఈ ప్రాజెక్టు పూడిపోతుందనే విషయమై సమాధానం ఇవ్వాలని కేంద్రం రాష్ర్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది.

సాక్షి, హైదరాబాద్: కంతనపల్లి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కొత్త కష్టాలు వచ్చాయి. పదేళ్లలో ఈ ప్రాజెక్టు పూడిపోతుందనే విషయమై సమాధానం ఇవ్వాలని కేంద్రం రాష్ర్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. డిజైన్ సరిగా లేదని వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో, ప్రాజెక్ట్ ప్రస్తుత డిజైన్‌లో మార్పులకు అవకాశం ఉందా? అనే విషయంపై కూడా కేంద్రం ఆరా తీసింది. ఈమేరకు,.. కేంద్ర జలవనరుల శాఖ నుంచి రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శికి ఈ నెల 18న లేఖ వచ్చింది.
 
 వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం,  కంతనపల్లి వద్ద ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. 22.5 టీఎంసీల నీటిని నిల్వచేసే సావుర్థ్యంతో రూపొందించిన ఈ బ్యారేజీనుంచి మొత్తం 50 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. తొలిదశలో బ్యారేజీ నిర్మాణం, వులిదశలో లిప్టులు, కాల్వల తవ్వకం చేపడతారు. బ్యారేజీ నిర్మాణానికి రూ. 1,809 కోట్ల అంచనాతో ఇటీవలే టెండర్లను ఖరారు చేశారు. వరంగల్ జిల్లాలో 4.23 ల క్షల ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 2.57 లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 69 వేల ఎకరాలు కలిపి, మొత్తం ఏడున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు ఈ ప్రాజెక్ట్‌నుంచి సాగునీరు అందనుంది. 450 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి కానుంది. అయితే లిప్టుల కోసం 878 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది.
 
 కాగా డిజైన్ సరిగాలేని ఈ ప్రాజెక్టుకు టెండర్ ఖరారు చేయుడం సరికాదంటూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై కేంద్రం స్పందిస్తూ, రాష్ట్రానికి లేఖ రాసింది. పూడిక అంశంపై అధ్యయనం చేపట్టారా? అని కేంద్రం ఆరాతీసింది. పూడిక తొలగిం పునకు తీసుకోవాల్సిన చర్యలు, డిజైన్ వూర్పునకు అవకాశాలు, ఇతర అంశాలపై నివేదిక ఇవ్వాలని కేంద్రం కోరింది. దీనిపై రాష్ర్ట ప్రభుత్వం త్వరలోనే సమాధానం పంపించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement