ఫోన్‌ మాట్లాడుతూ బస్సు నడిపితే ఇంటికే

Cell Phone Driving RTC Strict Rules In Tirupati - Sakshi

ఉత్తర్వులు జారీ చేసిన ఆర్టీసీ ఆర్‌ఎం

ఇప్పటికే ఒక డ్రైవర్ తొలగింపు

సత్యవేడులో మరొకరు సస్పెన్షన్‌

విధులకు సెల్‌ఫోన్‌ తీసుకెళ్లరాదని ఆదేశాలు

భయాందోళనల్లో ఆర్టీసీ కార్మికులు

తిరుపతి సిటీ:  సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ బస్సు నడిపితే ఆర్టీసీ కఠిన చర్యలు తీసుకోనుంది. ఇలా రుజువైతే ఉద్యోగం నుంచి తొలగించనుంది. తిరుమల డిపోకు చెందిన డ్రైవర్‌ జి. మంగయ్యను ఇటీవల ఇదే విధంగా తొలగించారు. సత్యవేడు డిపోకు చెందిన మరొకరు సెల్‌ఫోన్‌ డ్రైవ్‌ చేస్తుండటంతో తాజాగా  సస్పెండ్‌ చేశారు. ఈ చర్యలతో డ్రైవర్లలో  భయాందోళనలు నెలకొన్నాయి. ఈనెల 25 నుంచి విధులకు సెల్‌ఫోన్‌ తీసుకెళ్లరాదని ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌తోనేబస్సు ప్రమాదాలు..
బస్సు నడుపుతూ సెల్‌ఫోన్‌లో మాట్లాడటం వల్ల  జిల్లాలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని విచారణలో తేలింది. ఇటీవల మదనపల్లి– 2 డిపోకు చెందిన హైయర్‌ బస్సు కలికిరి వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు. బస్సు డ్రైవర్‌కు వెన్నెముక  పనిచేయలేని పరిస్థితి. అలాం టి పరిస్థితి ఎదురుకారాదని  కఠినమైన నిర్ణయాలు తీసుకున్నట్లు ఆర్‌ఎం తెలిపా రు. వన్‌మ్యాన్‌ సర్వీసు డ్రైవర్లు, టిమ్‌ మిషన్‌ ఉపయోగించే డ్రైవర్‌కు ఈ నిబం ధనలు వర్తించవా అని కార్మిక సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్లే టిమ్‌ మిషన్‌ ద్వారా టికెట్లు కొట్టి ఇస్తూ.. డబ్బులు తీసుకుంటూ  పనిచేస్తున్నారు. ఆ సమయంలో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడినంత మాత్రాన ఉద్యోగం నుంచి తొలగించడం సమంజసం కాదని ఎన్‌ఎంయూ రీజనల్‌ కార్యదర్శి రమణరావు అంటున్నారు. అవగా హన కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుం టుందని సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top