‘దున్నపోతు మీద వాన.. | buffalo to the rain | Sakshi
Sakshi News home page

‘దున్నపోతు మీద వాన..

Feb 19 2014 4:17 AM | Updated on Jun 2 2018 8:39 PM

‘దున్నపోతు మీద వాన.. - Sakshi

‘దున్నపోతు మీద వాన..

దున్నపోతు మీద వాన.. ఈ సర్కారు పాలన అంటూ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం

 ‘దున్నపోతు మీద వాన..
 
 కొయ్యలగూడెం,  : దున్నపోతు మీద వాన.. ఈ సర్కారు పాలన అంటూ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన నిర్వహించారు.
  జంగారెడ్డిగూడెం ఐసీడీఎస్ సెక్టర్ పరిధిలోని సుమారు వందమంది సిబ్బంది   ఐసీడీఎస్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఇప్పటి వరకు కనీసం యూనియన్ నాయకులతో ప్రభుత్వం చర్చలకు రాకపోవటం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. 22వ తేదీ వరకు కొనసాగించనున్న సమ్మెలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేసి ప్రజాప్రతినిధులను నిలదీయనున్నట్టు సభ్యులు పేర్కొన్నారు.
 యూనియర్ అధ్యక్షురాలు జి.విజయకుమారి, ఎస్‌కే నూర్జహాన్, జి.సుబ్బాయమ్మ, ఎస్.శ్రీదేవి, శాంతకుమారి, కె.కుమారి, భాస్కరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement