బీఎస్సీ ఎంఎల్‌టీ ఫలితాలు విడుదల | BSC MLT results announced | Sakshi
Sakshi News home page

బీఎస్సీ ఎంఎల్‌టీ ఫలితాలు విడుదల

Jan 25 2015 1:03 AM | Updated on Sep 2 2017 8:12 PM

డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన బీఎస్సీ (ఎంఎల్‌టీ) ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను శనివారం విడుదల చేసింది.

విజయవాడ: డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన బీఎస్సీ (ఎంఎల్‌టీ) ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను శనివారం విడుదల చేసింది. విద్యార్థులు తమ మార్కుల రీ-టోటలింగ్, వ్యక్తిగత పరిశీలన కోసం సబ్జెక్టుకు రూ.500 చెల్లించి ఫిబ్రవరి నాలుగో తేదీలోపు నేరుగా యూనివర్సిటీలో దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి.విజయకుమార్ తెలిపారు.
 
 దరఖాస్తు చేసుకునే మొదటి సంవత్సరం విద్యార్థులు ఫిబ్రవరి 19న, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు 20వ తేదీన ఉదయం 11 గంటలకు కళాశాల గుర్తింపు కార్డు, హాల్‌టికెట్‌తో యూనివర్సిటీలో హాజరుకావాలని సూచించారు. ఫలితాలు యూనివర్సిటీ (హెచ్‌టీటీపీ://ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్) వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
 

Advertisement
 
Advertisement
Advertisement