వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలం గోపవరం గ్రామంలో దుండగులు దారుణానికి పాల్పడ్డారు.
చెన్నూరు : వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలం గోపవరం గ్రామంలో దుండగులు దారుణానికి పాల్పడ్డారు. సుమారు 32 ఏళ్ల వయసున్న వ్యక్తిని గొంతు నులిమి, తలపై రాడ్‌తో మోది హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని పొలాల్లో పడేసి వెళ్లిపోయారు. మంగళవారం మధ్యాహ్నం మృతదేహాన్ని చూసిన రైతులు పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. సోమవారం రాత్రే హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కాగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.