సీమలో మరో నేత దారుణ హత్య | Brutal Murder in Chittoor district | Sakshi
Sakshi News home page

సీమలో మరో నేత దారుణ హత్య

May 28 2017 11:47 AM | Updated on Sep 5 2017 12:13 PM

సీమలో మరో నేత దారుణ హత్య

సీమలో మరో నేత దారుణ హత్య

రాయలసీమలో మరో రాజకీయ నాయుకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

చిత్తూరు: కర్నూల​ జిల్లా పత్తికొండ వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య మరువక ముందే మరో నేత హత్య వెలుగులోకి వచ్చింది. రాయలసీమలో మరో రాజకీయ నాయుకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కె.వి.బి పురం మండలంలోని కస్తూరిబా మోడల్‌ స్కూల్‌ సమీపంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రాజశేఖర్‌రెడ్డి(42)ని గుర్తుతెలియని దుండగులు అతికిరాతకంగా హతమార్చారు. శనివారం రాత్రి 10గంటల సమయంలో ఇటుకల బట్టీ నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా దారి కాసిన దుండగులు కత్తులతో నరికి చంపారు.

అతని మెడపైన నరికి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అతడు వేసిన కేకలు విని చుట్టు పక్కల వారు అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడు అప్పటికే మృతి చెందాడు. రాజశేఖర్‌ మెడపై బలమైన కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనతో కేవీబీ పురం ఉలిక్కిపడింది. విషయం తెలుసుకున్న పిచ్చాటూరు ఎస్సై మనోహర్‌ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మొదట యాసిడ్‌ పోసి అనంతరం కత్తులతో దారుణంగా హత్యచేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ హత్య వెనుక వివాహేతర సంబంధాలే కారణమై ఉంటాయని స్థానికులు అనుమానిస్తున్నారు. దుండగుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement