బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల నంద్యాల ప్రాంత రైతులకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి అన్నారు.
బ్రిజేశ్ తీర్పుతో అన్యాయం
Dec 16 2013 7:17 AM | Updated on Sep 2 2017 1:41 AM
నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల నంద్యాల ప్రాంత రైతులకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి అన్నారు. టెక్కె మార్కెట్ యార్డు నూతన పాలక మండలి ఆదివారం ప్రమాణస్వీకారం చేపట్టింది. ఆయన మాట్లాడుతూ తీర్పుతో నికరజలాలు ఉపయోగించుకునే అవకాశం ఉండదన్నారు. రైతులు లాభసాటి ధర కోసం పోరాటాలు చేయాలన్నారు. ప్రభుత్వం పామాయిల్, చక్కెర, గోధుమలను దిగుమతి చేసుకుందని, కాని రైతులను ప్రోత్సహించడం లేదన్నారు. రసాయనాల వాడకం, నీటి యాజమాన్య పద్ధతులపై రైతుశిక్షణకేంద్రాల ద్వారా అన్నదాతలకు వివరించాలన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాలసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ మూడుసార్లు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని నంద్యాల ప్రాంతానికి ఇచ్చామని, ఇకపై తమ ప్రాంతం వారికి ఇవ్వాలని కోరారు. మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ పీపీనాగిరెడ్డి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ రైతులకు అందుబాటులో ఉంటూ, సలహానిస్తూ సేవలను అందజేయాలని కోరారు.
కమిటీ ప్రమాణస్వీకారం: మార్కెట్‌యార్డు కమిటీ చైర్మన్‌గా సిద్ధంశివరాం, వైస్ చైర్మన్‌గా చంద్రశేఖర్‌రెడ్డి, సభ్యులుగా వంగాల నాగనందిరెడ్డి, బిజ్జల నాగేశ్వరరెడ్డి, కడుగు బాలమద్దిలేటిరెడ్డి, బత్తుల పెద్ద సుబ్బారెడ్డి, గద్వాల సుబ్బరాయుడు, మనిపాటి మురళీ, దివిరెడ్డి భారతమ్మ, నబీరసూల్, సేగి విజయభాస్కర్‌రెడ్డి, అయ్యపుశెట్టి సుబ్రహ్మణ్యం, గడ్డం వెంకటసుదర్శనం, కేవీఎస్‌ఎస్ కృష్ణమూర్తి ప్రమాణస్వీకారం చేశారు. ఆర్‌డీఓ నరసింహులు, తహశీల్దార్‌శివరామిరెడ్డి, మాజీ చైర్మన్ కైపరాముడు, శ్రీశైలం దేవస్థానం మాజీ చైర్మన్ పెసల శ్రీనివాసులుశెట్టి, ఆర్‌జీఎం విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ శాంతిరాముడు పాల్గొన్నారు.
Advertisement
Advertisement