నంద్యాల: వైఎస్సార్‌సీపీలోకి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు | TDP Workers Join YSR Congress Party | Sakshi
Sakshi News home page

Jan 13 2019 3:39 PM | Updated on Jan 13 2019 4:22 PM

TDP Workers Join YSR Congress Party - Sakshi

సాక్షి, నంద్యాల : ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు కొనసాగున్నాయి. తాజాగా నంద్యాల పట్టణంలోని వెంకటాచలం కాలనీకి చెందిన టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆ పార్టీని వీడి.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వెంకటాచలం కాలనీకి 34వ వార్డుకు చెందిన 50 కుటుంబాలకు చెందిన సుమారు వందమంది టీడీపీని వీడి.. వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ స్థానిక కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి సమక్షంలో వారు పార్టీలోకి వచ్చారు. ఈ సందర్భంగా వారికి వైస్సార్‌సీపీ కండువా కప్పి.. శిల్పామోహన్‌రెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement
 
Advertisement
Advertisement